1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. motkupalli narasimhulu latest comments

ఆలేరు స్వతంత్ర అభ్యర్థిగా మోత్కుపల్లి.. సంచలన ప్రకటన

తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ట

motkupalli narasimhulu
తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. టీడీపీతో పొత్తుల చర్చల కోసం కాంగ్రెస్ పార్టీ ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 
 
ఆలేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. గురువారం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 35 ఏళ్ల పాటు ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. 
 
మరోసారి ఆలేరు ప్రజలు తనను దీవించి శాసనసభకు పంపితే గోదావరి జలాలను సాధించి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 17న యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గంస్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశానని, విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.
తర్వాతి కథనం
నకిలీ ఫేస్ బుక్ ఐడీ.. స్వాతిరెడ్డి పేరుతో వేధింపులు