శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Modified: బుధవారం, 29 ఆగస్టు 2018 (18:12 IST)

భయంతోనే రాఖీ కట్టా.. నీపై సోదరభావం లేదన్న నటి

గత రెండు వారాలుగా హాట్ టాపిక్‌గా మారిన గీతా సామ్రాట్ వ్యవహారంలో మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఆశ్యర్యపరిచింది గీతామాధురి. నామినేషన్స్ ప్రక్రియలో గీతా పాంపరింగ్ కారణంగా నామినేట్ అయ్యాడు సామ్రాట్. ఆ రోజు రాత్రి ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాగా అప్‌సెట్ అయ్యాడ

గత రెండు వారాలుగా హాట్ టాపిక్‌గా మారిన గీతా సామ్రాట్ వ్యవహారంలో మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఆశ్యర్యపరిచింది గీతామాధురి. నామినేషన్స్ ప్రక్రియలో గీతా పాంపరింగ్ కారణంగా నామినేట్ అయ్యాడు సామ్రాట్. ఆ రోజు రాత్రి ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాగా అప్‌సెట్ అయ్యాడు సామ్రాట్. నామినేట్ అయినందుకు బాధగా లేదని, ఈ కారణం విన్నందుకు బాధపడుతున్నానని, తన మూడ్ బాలేదని చెప్పి పడుకుండిపోయాడు.
 
తర్వాత రోజు ఉదయం సామ్రాట్ దగ్గరికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు గీత. ఆ సందర్భంలో ‘భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ బ్రదర్ అండ్ సిస్టర్’ అనే రిలేషన్‌ని ఏర్పరచుకున్నామేమో అని నాకు అనిపిస్తుంది అంటూ సామ్రాట్‌కి రాఖీ కట్టడంపై తిరిగి ఆలోచనలో పడింది గీత. నేను రోల్ రైడా, అమిత్, గణేష్, తనీష్, కౌశల్‌లతో ఉన్నట్టే సామ్రాట్‌తో కూడా ఉంటున్నానని.. కానీ అందరూ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదంటూ తెగ ఫీల్ అయిపోయింది గీతా మాధురి. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో మరి, ఎందుకంటే బిగ్ బాస్‌లో ఏదైనా జరగచ్చు.