శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 28 ఆగస్టు 2018 (21:10 IST)

నాలో వాటిని చూసే అవకాశాలిస్తున్నారు... కాజల్ సంచలన వ్యాఖ్యలు

అందం అంటే ఆడవాళ్ళలోని అంగాంగం మాత్రమే కాదంటోంది సినీనటి కాజల్ అగర్వాల్. నా అందం చూసి చాలామంది దర్శకులు నాకు అవకాశాలిస్తున్నారన్న దాంట్లో ఎలాంటి నిజం లేదన్నారు కాజల్. నా నటన, క్రమశిక్షణ వీటిని చూసి మాత్రమే నాకు అవకాశాలు వస్తున్నాయంటోంది కాజల్.

చాలామంది హీరోయిన్లు అందంగా ఉంటేనే సినిమాల్లో అవకాశాలు ఇస్తారని, అంగాంగ ప్రదర్శన ఎంత చేస్తే అన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారు. అది పొరపాటు. అందులో ఏ మాత్రం నిజం లేదు. నేను ఇప్పటికే 50కి పైగా సినిమాలను పూర్తి చేసుకున్నాను. నాకు తెలుగు, తమిళ భాష రాదు. కానీ నాకు అవకాశాలు ఆగకుండా వస్తున్నాయి. 
 
అందం అనేది సినిమా పరిశ్రమలో ఒక అంశం మాత్రమే. మిగిలినవన్నీ కావాలి కదా. అది లేకపోతే ఎలా అంటోంది కాజల్ అగర్వాల్. కాజల్ వ్యాఖ్యలు తెలుగు, తమిళ సినీపరిశ్రమలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. అందమే హీరోయిన్‌కు ముఖ్యమని అందరికీ తెలుసు. కానీ కాజల్ ఎందుకు ఇలా చెబుతోంది అర్థం కాలేదంటున్నారు కొంతమంది.