1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. National Award for 'F‌2'

'ఎఫ్‌2' కు జాతీయ అవార్డు

National Award
వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్‌ 2' సినిమాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది.

గతేడాది విడుదలైన వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసారశాఖ అవార్డులు ప్రకటించింది. ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా.. ఇందులో గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'ఎఫ్‌ 2' సినిమాకు జాతీయ స్థాయి అవార్డు లభించింది.

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌ అందించారు.
తర్వాతి కథనం
ఘాటెక్కిన ఉల్లి ధర