బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (05:45 IST)

ఏపీ పోలీసు శాఖకు జాతీయ అవార్డులు.. ప్రత్యేకంగా ఏం చేసిందంటే...?

ఈ సంవత్సరం ఇప్పటికే 26 అవార్డులను దక్కించుకున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. టెక్నికల్ విభాగంలో 7 అవార్డులు, అనంతపురం జిల్లాకు 2, సీఐడీ విభాగానికి 1 అవార్డులను దక్కించుకుంది.

ఏడాది వ్యవధిలో  రికార్డ్ స్థాయిలో 36అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ.ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామని డీజీపీ  తెలిపారు. 
 
పోలీసు శాఖ ప్రత్యేకంగా ఏం చేసిందంటే...?
 
హోం క్వారంటైన్ అప్లికేషన్ :
ఇది నాన్-కాంటాక్ట్, ఆండ్రాయిడ్ / ఐఓఎస్ ఆధారిత అప్లికేషన్, ఇది కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి, విదేశాల నుండి వచ్చిన వారిని/ హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల కదలికలను వారి మొబైల్ ఫోన్ లో ఈ అప్లికేషన్ ను ఇంస్టాల్ చేయడం ద్వారా వారి కదలికలపైన నిరంతర పర్యవేక్షణకు ఉపయోగిస్తారు.

హోమ్ క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి ఇంటి నుండి 30 మీ. మించి బయటకు వస్తే తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్ (ఎస్‌హెచ్‌ఓ) తో పాటు యూనిట్ కంట్రోల్ రూమ్‌కు హెచ్చరికను ఇస్తుంది.

కోవిడ్ -19 ప్రారంభ దశలో ఈ హోమ్ క్వారంటైన్ అప్లికేషన్ ఫలితంగా 24,000 విదేశాల  నుండి వచ్చిన వారిలో   25 ప్రైమరీ పాజిటివ్‌ కేసులు, 11 సెకండరీ పాజిటివ్‌ కేసులను గుర్తించి,  వైరస్ వ్యాప్తి చెందకుండా  అరికట్టడం లో హోమ్ క్వారంటైన్ అప్లికేషన్ తో  సఫలమైన ఎపి పోలీసు శాఖ.‌
 
ఈ-హంట్ :
కేసుల దర్యాప్తు సమయంలో, అధికారులు ఒకే వేదిక నుండి వివిధ ఇతర విభాగాల ఏజెన్సీల డేటాబేస్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు, ఇది దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

నేరస్థులను గుర్తించడం మరియు సమర్థవంతoగా  లా అండ్ ఆర్డర్ అదుపు చేయడంలో ఇతర ఏజెన్సీల డేటాబేస్ పొందడంలో సమయం మరియు ప్రయత్నాలను తగ్గించడానికి - వివిధ డేటాబేస్లు అనుసంధానం చేయడంతో సత్ఫలితలను అందించాయి. 960 (అవుట్ ఆఫ్ వ్యూ) నేరస్థులను ఇ-హంట్ అనే సింగిల్ సెర్చ్ ద్వారా గుర్తించారు. అలాగే, ఇప్పటివరకు రాష్ట్రంలో 127 తప్పిపోయిన వాహనాలను గుర్తించాము.
 
ఎపి పోలీసు సేవ మొబైల్ అప్లికేషన్ (సిటిజెన్ సర్వీసెస్ ):
పోలీస్ సేవా మొబైల్ అప్లికేషన్ లో 86 పౌరసేవలను పొందుపరచడం ద్వారా, లాడ్జింగ్ పిటిషన్, ఎఫ్ఐఆర్ స్టేటస్, పాస్పోర్ట్ స్టేటస్, జాబ్ వెరిఫికేషన్స్, మిస్సింగ్ / లాస్ట్ డాక్యుమెంట్స్, ఫ్రెష్ / రెన్యూవల్ లైసెన్సులు, హౌస్ వాచ్ రిక్వెస్ట్స్, పెండింగ్ పౌరుల వాహనాల చలాన వివరాలు, మీ సమీప పోలీస్ స్టేషన్ వివరాలు  మొదలైనవి  సులువుగా తెలుసుకునే విధంగా రూపకల్పన చేశాం. 
 
రేస్( RACE- Remote Area Communication  Enhancement) 
* ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని మారుమూల గ్రామలకు సైతం చేరువయ్యే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజితో  ప్రవేశ పెట్టిన  అదునాతన కమ్యూనికేషన్ వ్యస్థతో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఆవిష్కరించిన రేస్ వాహనం జాతీయ స్థాయిలో  అవార్డును సొంతం చేసుకుంది.

 రేస్ వాహనం ప్రత్యేకతలు
* వాహనం లో డిజిటల్ మొబైల్ రిపీటర్.
* బేస్ రేడియో సెట్స్
* టెలీస్కోప్ ఐసీ య్యాంటినా
* జి.పి.ఆర్.ఎస్ సిస్టమ్
* పూర్తి స్థాయిలో శాటిలైట్ సిస్టమ్ వంటి పరికరాలను ప్రకృతి వైపరీత్యాలు , విపత్కర పరిస్థితుల్లో వినియోగిస్తారు.
 
ఈ-పాస్ 
వివరణాత్మక ధృవీకరణ అనoతరం  ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల కోసం లాక్ డౌన్ సమయం లో ఎపి పోలీసు విభాగం జారీ చేసిన  ఆన్‌లైన్ ఇ-పాస్‌లను జారీ చేశాo.
 
టైర్ -3 డాటా సెంటర్ :
విభజన అనంతరం పోలీసులు సరికొత్త టైర్ -3 డేటా సెంటర్‌ను స్థాపించింది. డేటా సెంటర్ లోడ్ బ్యాలెన్సర్లు, హై ఎండ్ ఫైర్‌వాల్స్, నెట్‌వర్క్ స్విచ్‌లు, సర్వర్లు, శాన్ స్టోరేజ్, హై స్పీడ్ ఇంటర్నెట్ లీజు లైన్లు మరియు అధిక కెవిఎ జనరేటర్లతో 72 గంటల పవర్ బ్యాకప్‌తో అప్‌గ్రేడ్ చేయబడింది.

ఫైర్ అలారంలు, స్మోక్ అలారాలు, నీటి లీకేజ్ డిటెక్షన్ కంట్రోల్ వంటి అన్ని అత్యవసర చర్యలు అమలు పరుస్తుంది. డేటా సెంటర్‌లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  ట్రాఫిక్‌ను సమర్థవంతంగా  నిర్వహించడానికి మరియు ఏపీ పోలీస్ డేటా సెంటర్‌లో హోస్ట్ చేసిన వివిధ అనువర్తనాలకు నిరంతరాయంగా సేవలను అందించే విధంగా అప్‌గ్రేడ్ చేయబడింది.
 
వినూత్న రీతిలో డ్రోన్ వినియోగం 
పోలీస్ సిబ్బందిని వైరస్ కి దూరంగా ఉంచుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రోన్ కెమెరాకు ఆడియో విధానాన్ని ఏర్పాటు చేయడంతో కంటైన్ మెంట్ జోన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఇది ఎంతగానో ఉపయోగపడింది.
 
హై అలెర్ట్ :
జిల్లాలో డెకాయిటీ  / రోబరీ మర్డర్ / చైన్ స్నాచింగ్ / కిడ్నాప్ / మరే ఇతర నేరాలు  లేదా లా అండ్ ఆర్డర్ సమస్య జరిగినప్పుడు రెడ్ అలర్ట్ అలారం ఇవ్వడం ద్వారా ఇది పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
 
4ఎస్4యూ :
సైబర్-క్రైమ్ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నివేదించడానికి బాధితులు / ఫిర్యాదుదారులను సులభతరం చేయడo  ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశ్యం. ఆన్‌లైన్ చైల్డ్ పోర్నోగ్రఫీ (సిపి), చైల్డ్ లైంగిక వేధింపులు  (సిఎస్‌ఎఎమ్) లేదా రేప్ / గ్యాంగ్ రేప్  / ఆర్‌జిఆర్) కంటెంట్ మరియు ఇతర సైబర్-నేరాల వంటి లైంగిక అసభ్యకరమైన విషయాలతో సహా అన్ని రకాల సైబర్-క్రైమ్ ఫిర్యాదులతో పాటు మొబైల్ నేరాలు, ఆన్‌లైన్ మరియు సోషల్ మీడియా నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు,   హ్యాకింగ్, క్రిప్టో కరెన్సీ నేరాలు మరియు ఆన్‌లైన్ సైబర్ అక్రమ రవాణా పైన ఫిర్యాదులను స్వీకరిస్తారు.