మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (20:33 IST)

తమ్ముడి భార్యతో అక్రమ సంబంధం, ఆగ్రహంతో ఊగిపోయిన రోజా, ఎక్కడ?

ప్రజాప్రతినిధిగా, నటిగా రోజా వందకు వందమార్కులు సాధిస్తున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు రోజా. అంతకుముందే సినీనటిగా ఆమేంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం సమాజసేవలో సామాజిక దృక్పథంలో వ్యవహరిస్తున్నారు.
 
ఒక ప్రైవేటు ఛానల్లో వస్తున్న బతుకు జట్కా బండి ఎపిసోడ్ కాస్త పెద్ద చర్చే జరుగుతోంది. ఇందులో న్యాయ నిర్ణేత రోజా. ఒక కుటుంబంలో ఎదుర్కొనే సమస్యను వారిని దగ్గర కూర్చోబెట్టుకుని పరిష్కరిస్తుంది రోజా. తాజాగా ఆమె తీర్పు ఇచ్చిన ఒక ఎపిసోడ్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.
 
తనను భర్తతో పాటు అతని అన్న అనవసరంగా కొడుతున్నారని... తన తల్లిదండ్రుల ఆస్తి కోసం వేధిస్తున్నారని.. వేరొక మగాడితో తనకు లింకు కూడా పెడుతున్నారంటూ ఒక వివాహిత బోరున విలపించింది. రోజా ముందు తన సమస్యను చెప్పుకుంది. అంతేకాదు తన భర్త, ఆయన తమ్ముడి భార్యను తెచ్చుకుని సంసారం చేస్తున్నాడని చెప్పింది.
 
దీంతో శివాలెత్తిన రోజా అతన్ని పిలిచి ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక మహిళ జీవితాన్ని నాశనం చేస్తావా అంటూ చెడామడా తిట్టేశారు. దీంతో అతని నోటి నుంచి మాట రానేలేదు. ఇలా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు రోజా. వారి సమస్యను పరిష్కరించే దిశగా ఆమె ప్రయత్నిస్తున్నారు. రోజా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.