శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (10:06 IST)

చనిపోయేముందు 10 మందిని రక్షించి : నాన్న.. నేను చనిపోయినా చనిపోవచ్చంటూ ఫోన్!

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద తీవ్రతనే కాదు.. తాము ప్రాణాలతో బతికిబయటపడమే విషయాన్ని విధుల్లో ఉన్న సిబ్బంది ముందుగానే గుర్తించారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లో తమను రక్షించలేకపోతే.. చనిపోవడం ఖాయమని వారు ఊహించారు. అందుకే ఏఈ సుందర్ నాయక్ (36) తన భార్యకు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశాడు. '15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడేందుకు ఎవ్వరూ రాకపోతే మేం బతికే పరిస్థితి లేదు. నువ్వూ.. పిల్లలు జాగ్రత్త' అని ఫోన్లోనే చెప్పాడు. అవే ఆయన నుంచి చివరి మాటలయ్యాయి. 
 
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్ర ప్రమాద మృతుల్లో తొలుత బయటపడింది సుందర్‌ మృతదేహమే. కరోనా నుంచి కోలుకున్న ఆయన, విధుల్లో చేరిన మరుసటి రోజే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఆరేళ్ల క్రితం మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన ప్రమీలతో పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పవర్‌ ప్రాజెక్టు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. 
 
ఈయన గురువారం రాత్రి 10:30 గంటలకు ప్రమాదం జరగ్గా 11:30-12 మధ్యలో భార్య, స్నేహితుడు అనిల్‌కు మోహన్‌ ఫోన్‌ చేశారు. తనకు ఏమైనా జరగొచ్చునని.. పిల్లలు.. మీరు జాగ్రత్త అని భార్యకు చెప్పారు. తాను ప్రాణాలు వదిలే ముందు 10 మంది సహచరులను మోహన్‌ కాపాడారు. ఆయన మాట్లాడిన చివరి మాటలు.. 
 
'నాన్న.. నేను ప్రమాదంలో ఉన్నా. వస్తే అరగంటలో బయటికి వస్తాను. లేదంటే కష్టం. చనిపోయినా చనిపోవచ్చు' అని చెప్పారు. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన హెచ్‌ఎంటీ రిటైర్డ్‌ ఉద్యోగి నర్సింహారావు పెద్దకుమారుడు. జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశారు. 2013-14లో సబ్‌ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. 
 
మొదటి నుంచి శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలోనే పని చేస్తున్నారు. సున్నిపెంటకు చెందిన పావనిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి పార్థు (5), నిహారిక (7 నెలలు) పిల్లలు. రాత్రి 10:30 గంటలకు ప్రమాదం జరగ్గా 11:30-12 మధ్యలో భార్య, స్నేహితుడు అనిల్‌కు మోహన్‌ ఫోన్‌ చేశారు. తనకు ఏమైనా జరగొచ్చునని.. పిల్లలు.. మీరు జాగ్రత్త అని భార్యకు చెప్పి ప్రాణాలు విడిచారు.