గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (09:13 IST)

సుశాంత్ ప్రియురాలి కాల్ డేటాలో 'ఏయు'... ఎవరా ఏయూ??

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసును ఇప్పటికే సీబీఐ విచారిస్తోంది. అలాగే, సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి కోట్లాది రూపాయలు బదిలీ అయ్యాయన్న ఫిర్యాదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో సోదరుడు శోవిక్‌, తండ్రి ఇంద్రజిత్‌, మాజీ మేనేజర్‌ శృతి మోడీ, సిద్దార్థ్‌ పితానిని విచారించారు. 
 
ఈ దర్యాప్తులో భాగంగా రియాతోపాటు ఆమె సోదరుడు, తండ్రి ఫోన్లను అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఫోరెన్సిక్‌ ఎగ్జామినేషన్‌ కోసం ల్యాప్‌టాప్‌, ఐప్యాడ్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే రియా చక్రవర్తి కాల్‌ రికార్డులో ఓ అనుమానాస్పద పేరును ఈడీ అధికారులు గుర్తించారు.
 
రియా కాల్‌ చేసిన ఓ ఫోన్‌ నంబర్‌ ఏయూ పేరుతో ఉందట. అయితే ఏయూ ఎవరనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీయగా.. అది అన్నయ ఉద్ధస్‌ అనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ నంబర్‌ అని, ఆ వ్యక్తికి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని నిర్దారణకు వచ్చారని తెలుస్తోంది. సుశాంత్‌ ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.