మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (17:00 IST)

నా భర్త అమితంగా ప్రేమిస్తున్నాడు.. కొట్టడు.. తిట్టడు.. విడాకులిచ్చేస్తున్నా..!

భర్తకు విడాకులిచ్చే భార్యలు కొన్ని కారణాల చేత విడాకులు తీసుకుంటారు. భర్త ప్రవర్తన నచ్చకపోవడమో, మోసం చేశాడనో విడాకులు తీసుకుంటారు. కానీ ఇక్కడ వింత సంఘటన ఎదురైంది. తాజాగా తన భర్త తనతో గొడవ పడలేదన్న కారణంతో విడాకులు కావాలని ఓ ముస్లిం మహిళ కోర్టును అభ్యర్థించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. 18 నెలల క్రితం ఇద్దరికి వివాహం జరిగిన ఓ మహిళ తనకు విడాకులు కావాలంటూ ఇటీవల షారియా కోర్టును ఆశ్రయించింది. అందులో తన భర్త ప్రేమను తాను భరించలేకపోతున్నానంటూ పేర్కొంది. తన భర్త అమితమైన ప్రేమను చూపిస్తున్నాడని.. గట్టిగా అరవడని.. తనపై నిరాశ చెందడని.. ఈ వాతావరణం తనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కోసారి అతడే వంట చేస్తాడు. ఇంటి పనుల్లో సాయం చేస్తాడు. తాను తప్పు చేసినా తనను క్షమిస్తాడు. అతడితో ఏదైనా వాదించాలనిపిస్తుంటుంది. ప్రతి విషయానికి ఒప్పుకునే భర్త తనకు వద్దంటూ తన పిటిషన్‌లో వెల్లడించింది.
 
దీనిపై స్పందించిన విచారణ జరిపిన కోర్టు.. ఇదొక పనికిమాలిన చర్య అంటూ పిటిషన్‌ని కొట్టివేసింది. ఇక ఈ విషయాన్ని భార్య, భర్తనే పరిష్కరించుకోవాలంటూ కోర్టు వెల్లడించింది. కాగా మరోవైపు తన భార్యను ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలనుకుంటానని ఆ భర్త తేల్చి చెప్పేశాడు.