సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (15:30 IST)

అల్లుడుతో అక్రమ సంబంధం.. కుమార్తె - మరో వ్యక్తితో కలిసి భర్తను ...

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా, వావివరుసలు మరిచిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. చివరకు ఈ సంబంధాలే ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా అల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ అత్త... కట్టుకున్న భర్తను కడతేర్చింది. ఇందులో కుమార్తె, అల్లుడుతో పాటు.. మరోవ్యక్తి కూడా తనవంతు సహకారం అందించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనగర్‌కు చెందిన గోగుల నాగశేషు(38) ఈనెల 13న హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. 
 
మద్యానికి బానిసైన నాగశేషు... కొంతకాలంగా భార్య శ్రీదేవిని హింసిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే శ్రీదేవికి అల్లుడు (కుమార్తె భర్త)తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో ప్రతి రోజూ వేధిస్తున్న భర్తను హతమార్చాలని భార్య ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని అల్లుడు మీరావలి, కుమార్తె లక్ష్మికి చెప్పగా, వారు కూడా సమ్మతించారు. వీరితోపాటు తమ బంధువు సుబ్బరాయుడు కలిసి ఈ నెల 13వ తేదీన నిద్రపోతున్న నాగశేషును తలపై రోకలిబండతో మోది చంపేశారు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు అల్లుడు ఆటోలో తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలో నిమగ్నమైవున్నట్టు తెలుసుకుని ఆటోను అక్కడే వదిలివేసి పారిపోయినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో హత్య చేసిన భార్య, కుమార్తె, అల్లుడు, సుబ్బారాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.