సంబంధిత వార్తలు
- వరంగల్ ఎంజిఎంను హైదరాబాద్ గాంధీలా చేస్తాం: ఈటెల రాజేందర్
- భర్తను చంపి అద్దె ఇంట్లో పూడ్చిపెట్టి... రంకుమొగుడితో భార్య రాసలీలలు
- బాలీవుడ్ మూవీ దృశ్యం దర్శకుడు ఇకలేరు...
- వెంటిలేటర్‌పై "దృశ్యం" దర్శకుడు నిషికాంత్.. అతనికోసం ప్రార్ధన చేద్దామంటున్న జెనీలియా భర్త
- ప్రియుడి కోసం భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య
భార్య నల్లగా ఉందనీ.. ఆ కిరాతక భర్త ఏం చేశాడంటే...
సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు తలెత్తడం సహజమే. కొన్ని క్షణాల్లో అవన్నీ సర్దుకునిపోతాయి. కానీ, ఇక్కడ ఆ మనస్పర్థలే ఓ వివాహిత దారుణ హత్యకు కారణమయ్యాయి. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాకు చెందిన యోగి, అరుణ యువతీయువకులు ఆర్నెల్ల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి మియాపూర్‌లో ఉంటున్నారు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీనికి కారణం భార్య నల్లగా ఉండటమే. ఈ ఒక్క కారణంతో మంగళవారం సాయంత్రం ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం యోగి కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. అయితే.. ప్రేమించిన యువతితోకాకుండా మేనకోడలితో పెద్దలు పెళ్లి చేయడంతో భార్యను యోగి వేధించసాగాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.