వెంటిలేటర్‌పై "దృశ్యం" దర్శకుడు నిషికాంత్.. అతనికోసం ప్రార్ధన చేద్దామంటున్న జెనీలియా భర్త
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా నటించిన చిత్రం దృశ్యం. ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి టబు హీరోయిన్. ఈ ఒక్క చిత్రంతో లైమ్ లైట్‌లోకి వచ్చిన హిందీ దర్శకుడు నిషికాంత్(50) అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచినట్టు ప్రచారం జరిగింది.
జూలై 31న గచ్చిబౌలిలోని ఎఐజీ ఆసుపత్రిలో లివర్ సిరోసిస్ అనే వ్యాధితో అడ్మిట్ అయ్యారు. వ్యాధి తీవ్రత ఎక్కువై పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. చిత్ర నిర్మాత మిలాప్ జావేరి ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
అయితే, దర్శకుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారంటూ పలువురు సెలబ్రిటీలు తమ ట్వీట్ల ద్వారా తెలిపారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు స్పష్టం చేశారు. అయితే అతను ఇంకా బ్రతికే ఉన్నాడని జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిషికాంత్ కామత్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. అతను చనిపోలేదు. అతని కోలుకోవాలని ప్రార్ధిద్దాం అంటూ రితేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, నిషికాంత్ 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మలయాళ హిట్ 'దృశ్యం' హిందీ రీమేక్‌కి దర్శకత్వం వహించారు. 'ముంబై మేరీ జాన్, ఫోర్స్, లై భారీ' చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. నటుడిగాను పలు చిత్రాలలో నటించారు. పలు మరాఠీ సినిమాలకి కూడా దర్శకత్వం వహించారు.