మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (11:24 IST)

మహిళా డైరక్టర్ సంజనా రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం? వెంటిలేటర్‌పై..?

sanjana reddy
ప్రముఖ మహిళా దర్శకురాలు సంజనా రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈమె జ్వరంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచినట్టు సమాచారం. ఈమె విషయమైన ప్రముఖ రచయత కోన వెంకట్ మాట్లాడుతూ.. ఆమె గత మూడు రోజులుగా ద్రవాహారం తీసుకుంటున్నట్టు చెప్పారు. మొత్తానికి ఆమె తిరిగి ఆరోగ్యంగా కోలుకోవాలని ఆశించారు. 
 
కాగా.. సంజనా రెడ్డి గతంలో రాజ్ తరుణ్ హీరోగా ' రాజుగాడు' అనే సినిమాతో దర్శకురాలిగా మారింది. అంతకుముందు ఈమె జర్నలిస్టుగా కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసింది. ఈమె త్వరలో కరణం మల్లీశ్వరిపై తెరకెక్కే బయోపిక్‌ను డైరెక్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. కరణం మల్లీశ్వరి బర్త్ డే సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ కూడా విడుదల చేశారు. అయితే ఆమె ఆరోగ్యం విషమంగా వున్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై ఆమెను వుంచారని సమాచారం.