మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (11:15 IST)

ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ.. ఐదుగురికి అధికారులకు కరోనా

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కోవిడ్‌ బారిన పడుతుండటంతో వాటిని మూసివేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రధాన కార్యాలయానికి వైరస్‌ సెగ తాకింది. అందులో పనిచేసే ఐదుగురు అధికారులకు కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో సన్నిహితంగా ఉన్న పది మందికిపైగా సిబ్బందిని క్వారంటైన్‌ చేశారు. 
 
శానిటైజేషన్‌ పనులు చేపట్టేందుకు ప్రధాన కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయాన్ని అధికారులు వారానికి రెండు రోజులు శానిటైజేషన్‌ చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులు హాజరవుతున్నారు.