గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జులై 2020 (17:54 IST)

జెనీలియా దంపతులకు హ్యాట్సాఫ్.. డాక్టర్స్ డే రోజున ఆ నిర్ణయం?

Riteish Deshmukh, Genelia DSouza
''బొమ్మరిల్లు'' ఫేమ్ జెనీలియా అందరికీ గుర్తుండే వుంటుంది. బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన జెనీలియా బాలీవుడ్ నటుడు రితీశ్ దేశ్ ముఖ్‌ను ప్రేమవివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఆపై సినిమాలకు దూరమైంది. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో వుంది. తాజాగా డాక్టర్స్ డే సందర్భంగా రితీశ్ దేశ్ ముఖ్‌-జెనీలియా జంట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
తమ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నామని ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో తెలిపారు. అవయవదానం గురించి తామిద్దరం చాలా రోజులుగా ఆలోచిస్తున్నాం. ఆ నిర్ణయం తీసుకోవడం ఇంత వరకు కుదరలేదు. డాక్టర్స్ డే సందర్భంగా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఆ వీడియోలో తెలిపారు.
 
ఇతరులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వడమేనని జెనీలియా ఇంస్టాగ్రామ్ వీడియోలో తెలిపారు. ఇతరుల ప్రాణాలను కాపాడటానికి అందరూ ముందుకు రావాలని అభిమానులకు పిలుపునిచ్చారు. 
 
అవయవ దానం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై జెనీలియా-రితేష్ ఫ్యాన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. విపరీతంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.