విశాఖలో అతిపెద్ద అతిథి గృహం
ఏపీ ప్రభుత్వం విశాఖలో అతిపెద్ద అతిథి గృహం నిర్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు కార్యాచరణకు దిగింది. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడీ అతిథి గృహం నిర్మించడానికి పూనుకోవడం గమనార్హం.
భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడలో 30 ఎకరాల్లో అతిథి గృహం నిర్మించాలని నిర్ణయించింది. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ విభాగం ఉంది. అదంతా కొండ ప్రాంతం. పైనుంచి చూస్తే ఒక వైపు సముద్రం...మరో వైపు దూరంగా జాతీయ రహదారి కనిపిస్తాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ సహా వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రొటోకాల్ ప్రకారం గెస్ట్‌హౌ్‌సలు సమకూర్చడం ప్రస్తుతం కష్టంగా ఉంటోంది.
అటు విజయవాడ, ఇటు విశాఖ స్టార్ హోటళ్లలో వసతికి భారీ వ్యయమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ గెస్ట్‌హౌ్‌సలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది నెలల్లో దీనిని పూర్తి చేయాలని నిర్ణయించింది.