శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (14:10 IST)

డిసెంబరు 18న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్‌

విశాఖపట్నం మరో అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు 18న భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. 
 
డిసెంబరులో భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్‌ జట్టు మూడు టీ 20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబరు ఆరు నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుండగా, డిసెంబరు 15న జరిగే తొలి వన్డేకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుండగా, డిసెంబరు 18న జరిగే రెండో వన్డేకు ఇక్కడి ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా నిలవనుంది. 
 
చివరి వన్డే డిసెంబరు 22న కటక్‌లోని బారబతి స్టేడియంలో జరగనుంది.