ప్రియుడుతో కలిసి భర్తనే హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య

murder
శ్రీ| Last Modified బుధవారం, 19 ఆగస్టు 2020 (10:22 IST)
గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో చిరంజీవి అనే ఆర్ఎమ్‌పి డాక్టర్ కేసును రూరల్ పోలీసులు చేదించారు. ఇంతకీ ఏం జరిగిందంటే... చిరంజీవి కనిపించడం లేదని తన తండ్రి
ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చిరంజీవి ఆర్‌ఎమ్‌పి డాక్టర్. మృతుడి మొదటి భార్యతో విడాకులు తీసుకుని శిరీష అనే మహిళను రెండవ పెళ్లి చేసుకున్నాడు.

చిరంజీవి వద్ద పని చేస్తున్న భానుప్రకాష్ అనే వ్యక్తితో శిరీష అక్రమ సంబంధం పెట్టుకుంది. లాక్ డౌన్ క్రమంలో మృతుడు ఇటీవలే తన షాపును అమ్మాడు. ఆ డబ్బును తన వద్ద పెట్టుకున్నాడు. ఐతే ఆ డబ్బుతో పాటు అతడి అడ్డును తొలగించుకోవాలని తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.

మూడు నెలల క్రితం ప్రియుడు భాను ప్రకాష్‌తో కలిసి భర్తను శిరీష హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా అతడి శవాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. మృతుని తండ్రికి తన కొడుకు గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు.

తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు చేయడంతో భార్య ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్టు తేలింది. మానవత్వం
లేకుండా కట్టుకున్న భర్తనే పదకొండు లక్షల రూపాయల కోసం హత్య చేసింది. హత్యకు పాల్పడిన శిరీష ఆమె ప్రియుడు భానుప్రకాష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తప్పు చేసి తప్పించుకోవడం కుదరదని ఈ కేసుతో తేలిందిని రూరల్ ఎస్పీ విశాల్ తెలియచేసారు.దీనిపై మరింత చదవండి :