శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (06:02 IST)

నేడు శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీదేవిగా దుర్గ‌మ్మ

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 6వ‌ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ ష‌ష్ఠి గురువారంనాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీ ల‌లితా త్రిపుర సుంద‌రీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది.

శ్రీచ‌క్ర అధిష్టానశ‌క్తిగా, పంచ‌ద‌శాక్ష‌రీ మ‌హామంత్రాది దేవ‌త‌గా త‌న‌ను కొలిచే భ‌క్తుల‌ను క‌రుణిస్తుంది. కుడివైపున ల‌క్ష్మీదేవీ, ఎడ‌మ‌వైపున స‌ర‌స్వ‌తీ దేవి సేవ‌లు చేస్తుండ‌గా చెఱ‌‌కుగ‌డ, విల్లు పాశాంకుశ‌ల‌ను ధ‌రించి ఎరుపు, నీలం రంగు చీర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది.

ఈ రోజున అమ్మ‌వారికి రాజ‌భోగం పేరుతో పాయ‌సాన్నం, చ‌క్రాన్నం, పూర్ణాలు, అల్లంగారెలు... ఇలా ప‌దిర‌కాల నైవేద్యాల‌ను స‌మ‌ర్పిస్తారు.