సంబంధిత వార్తలు
- 21న దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నజగన్
- గాయత్రీ దేవిగా కనకదుర్గమ్మ
- నవరాత్రుల్లో దుర్గమ్మ నవ అలంకరణలు తెలుసా?
- జయ జయహే .. మహిషాసుర మర్దిని… భక్తుల పాలిట కొంగుబంగారం బెజవాడ దుర్గమ్మ
- టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే దుర్గమ్మ దర్శనం.. భవాని భక్తులకు సైతం ఆన్లైన్ టిక్కెట్లు తప్పనిసరి
సరస్వతీదేవిగా దుర్గమ్మ
శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ సప్తమి బుధవారంనాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది.
అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.
త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాత తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజున అమ్మవారికి గారెలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
