సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (12:40 IST)

ఆనందయ్య మందుతో ప్రాణం నిలబడింది... కరోనా రోగి 'ఆనంద' భాష్పాలు

ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందు అనేక మంది కరోనా రోగుల ప్రాణాలను రక్షిస్తోంది. తాజాగా ఓ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగి కళ్ళలో వేసిన పసురుతో కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఆ రోగి ఆనంద భాష్పాలు కారుస్తూ వెల్లడిచారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న.. ఇంకా రెండు నిముషాలు ఆగితే, ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. దీంతో వెంటనే మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నానని, ఈ మందు చాలా అద్భుతమని కృష్ణపట్నం మందు వేసుకున్న ఓ వ్యక్తి చెప్పారు. 
 
ఇపుడు కృష్ణపట్నం పేరు మార్మోగిపోతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందుపంపిణీ చేస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. 
 
ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. 
 
ఈ మందు కోసం ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. అందుకు తగినట్టుగా జిల్లా పోలీసులతో ఏర్పాట్లు చేయించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఆయుర్వేద మందును అందజేస్తున్నారు.