ఆనందయ్య మందు.. కరోనా మటాష్.. శుక్రవారం నుంచి పంపిణి
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
"కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న ఆయుర్వేద మందును, శుక్రవారం (21-05-2021) నుండి పంపిణీ చేస్తున్నాం. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందుతో ఎటువంటి హానీ ఉండదు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది."అని కాకాణి పేర్కొన్నారు.
అంతేకాదు, ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పిన కాకాణి, కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.