గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (12:39 IST)

కిరోసిన్ తాగితే కరోనా చనిపోతుందని తాగేశాడు.. చివరికి?

Kerosene
మొన్నటికి మొన్న.. ఓ మాతాజి కరిగించిన వెండిని తాగితే కరోనా సోకదంటూ. తాగి మరణించింది. తాజాగా.. కిరోసిన్ తాగితే.. కరోనా చచ్చిపోతుందని పిచ్చిగా నమ్మాడో ఓ వ్యక్తి. కిరోసిన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ వ్యక్తికి అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. కరోనా సోకిందని తీవ్రంగా భయపడిపోయాడు. కరోనాను కిరోసిన్ చంపేస్తుందని తెలిసిన వ్యక్తి అతడికి చెప్పాడు. తనకు వచ్చిన కరోనా వైరస్ పోవాలంటే..కిరోసిన్ తాగడమే ఒక్కటే పరిష్కారమని..భావించాడు. అమాంతం కిరోసిన్ తాగాడు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించి…చనిపోయాడు.
 
మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి..పోస్టుమార్టం నిర్వహించారు. కరోనా పరీక్ష నిర్వహించగా.. టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. అతడికి అసలు కరోనా సోకలేదని రిపోర్టుల్లో తేలింది. భయం వల్లే ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు వెల్లడిస్తున్నారు.