1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. No permission for Pawan Kalyan sramadanam

అక్టోబర్ 2వ తేదీన శ్రమ దానం..పర్మిషన్ ఇవ్వని ఏపీ సర్కారు

Pawan Kalyan
అక్టోబర్ 2వ తేదీన శ్రమ దానం కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శ్రమ దానం కార్యక్రమానికి ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాటన్ బ్యారేజీపై జనసేన పార్టీ తల పెట్టిన శ్రమ దానానికి పర్మిషన్ నిరాకరించింది ఏపీ సర్కార్. పవన్ కళ్యాణ్ శ్రమదాన కార్యక్రమానికి అస్సలు అనుమతులు లేవని తేల్చి చెప్పేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ ఎస్ ఈ. 
 
కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధి లోకి రాదని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ప్రకటన చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ ఎస్ ఈ. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్నారు అధికారులు. 
 
ఇక అటు బ్యారేజీ పై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతాం అంటున్నాయి జనసేన శ్రేణులు. ఇందులో భాగంగానే తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలలో పవన్ శ్రమదానం కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి