1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Notification to Junior Assistant Posts in Revenue Department

రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి పచ్చజెండా

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులోభాగంగా కొత్తగా 1180 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టనున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా ఏపీ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 
 
అదేవిధంగా గత జూన్ నెలలో విడుదల చేసిన జాబ్ క్యాలెండరులోకి మరిన్ని పోస్టులను చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 1,180 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఈ ఖాళీల్లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన (EWS) రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు చేస్తే చిక్కుల్లో పడనున్న భారతీయ విద్యార్థులు