ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (08:33 IST)

ఆగస్టు 16 నుంచి తెరుచుకోనున్న స్కూల్స్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూల్స్ తెరవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 
 
గురువారం జగనన్న విద్యాదీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బడులు తెరుచుకున్న రోజునే జగనన్న విద్యాకానుకను పంపిణీ చేస్తామన్నారు. 
 
విద్యాకానుకలో ఈసారి డిక్షనరీని కూడా చేర్చినట్టు తెలిపారు. అలాగే, నాడు-నేడులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేసిన 15 వేల బడులను ప్రజలకు అంకితం చేయనున్నట్టు తెలిపారు. అదే రోజున రెండో విడత నాడు-నేడుకు శ్రీకారం చుడతామని మంత్రి వివరించారు.
 
ఇదిలావుంటే దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీనికి రాష్ట్రంలో నమోదతువున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగదలే కారణంగా చెప్పుకోవచ్చు. కేరళ వంటి రాష్ట్రాల్లో రెండు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్ కూడా విధించారు.