శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-07-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని మందార పూలతో పూజించినా...

మేషం : కుటుంబ వివాదములు, ఆరోగ్యంలో లోపాలు తప్పవు. పాత స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణాల యందు చెడు స్నేహాల వల్ల ఒకింత చికాకులు తప్పవు. విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. ధన వ్యయం అధికమవుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆత్మి విశ్వాసం పెరుగుతుంది. 
 
వృషభం : ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమ్మాటం పెట్టే అవకాశం ఉంది. సమావేశాలకు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. పెద్దలతో సోదరీ, సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. 
 
మిథునం : బంగారు, వెండి, వస్త్ర, కిరాణా వ్యాపారస్తులకు అశాజనకంగా ఉంటుంది. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం కొరవడుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. కంపెనీ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది అని గమనించండి. 
 
కర్కాటకం : వృత్తి ఉద్యోగములయందు గౌరవంతో నడుచుకోగలగుతారు. అంతర్గత సమస్యలను అధిగమిస్తారు. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి రాగలవు. విద్యార్థులలో ఒత్తిడి, ఆందోళన అధికమగును. ఊహించని విధంగా ధనప్రాప్తి లభించును. 
 
సింహం : రాజకీయాలలో వారు తొందరపడిన వాగ్ధానాలు చేయకండి. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. రవాణా రంగాల వారికి చికాకులు ఎదురుకావొచ్చు. 
 
కన్య : మీకు నచ్చిన సంఘటనలు కొన్ని ఎదురుకావొచ్చు. సాంస్కకృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కలప, ఐరన్, ఇటుకు, సిమెంట్ వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ప్రైవేటు రంగాల్లో వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. 
 
తుల : విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి అధికం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
వృశ్చికం : బ్యాంకు వ్యవహారాలు అనుకూలం. గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయవలసి వస్తుంది. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
ధనస్సు : వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. 
 
మకరం : వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. విద్యార్థులకు టెక్నికల్, సైన్స్, కంప్యూటర్ రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, పుణ్య, కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. ఫైనాన్స్ చిట్ ఫండ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. 
 
కుంభం : హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. శుభవార్తలు వింటారు. నూతన దంపతులు కొత్త అనుభూతులకు లోనవుతారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కిరాగలవు. వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. సోదరుల విషయంలో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. 
 
మీనం : వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి పొందుతారు. రుణాల కోసం అన్వేషిస్తారు. రాజకీయ, కళారంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. హామీలకు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకంగా ఉంటుంది. శ్రమానంతరం కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.