సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

26-07-2021 సోమవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా...

మేషం : మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. 
 
వృషభం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కారిస్తారు. ఒక్కోసారి మంచి చేసినా విరమ్శలు తప్పవు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
మిథునం : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు నూతన పరిచయాలు సంతృప్తినిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ ఏకాగ్రత అవసరమని గమనించండి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకం కాదు. స్త్రీలు కళ, క్రీడా పోటీల్లో రాణిస్తారు. విద్యార్థులకు అధ్యాపకులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన పెట్టుబడులు మరికొంతకాలం వాయిదా వేయడం శ్రేయస్కరం. పత్రికా సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
సింహం : ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. భూ వివాదాలు, ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం శ్రేయస్కరం. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. 
 
కన్య : కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. చేసేపనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. 
 
వృశ్చికం : నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. నూతన కాంట్రాక్టర్లు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు వేధింపులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. 
 
ధనస్సు : విద్యా సంస్థలలోని వారికి అనుకూలంగా ఉండగలదు. దూర ప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. స్థిరాస్తులు కొనుగోలు యత్నాలు చేస్తారు. చిట్స్, పైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి తప్పదు. ఖర్చులు అదుపు చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. పోస్టల్, ఎల్‌ఐసీ ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. 
 
కుంభం : ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విలువైన పత్రాలు చేజారిపోయే ఆస్కారం వుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడతారు. పారిశ్రామికరంగంలోని వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. అపరిచిత వ్యక్తుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
మీనం : స్త్రీలకు కళ్ళు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. వృత్తిపరంగా చికాకులు, సమస్యలు తలెత్తినా ధైర్యంగా నిలదొక్కుకుంటారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం వల్ల అన్ని విధాలా శ్రేయస్కరం. త్వరలో మీ ఆశయం నెరవేరుతుంది.