గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-07-2021 ఆదివారం దినఫలాలు - ఇష్టదైవాన్ని సందర్శించినా...

మేషం : విదేశీయాన ప్రయాణాలు వాయిదాపడతాయి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తుకు లాభదాయకం. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ధనం ఇతరులకు ఇచ్చినా తిరిగి రాజాలదు. పాత జ్ఞాపకాలు గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పంచుకుంటారు. 
 
వృషభం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
మిథునం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కుటుంబీకులతో కలిసి దూర ప్రదేశాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బంధువులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ఆస్కారం వుంది. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పాత వస్తువులనుకొని సమస్యలు తెచ్చుకోకండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. మీలో దయాగుణం వికసిస్తుంది. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. 
 
సింహం : కొబ్బరి, పండ్లు, పూల కూరగాయల వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. గృహంలో విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాట పడవలసి వస్తుంది. 
 
కన్య : కిరాణా, ఫ్యాన్సీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దంపతులు పరస్పర అవగాహనతో మెలగాలి. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
తుల : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. దైవ, దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
వృశ్చికం : కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మీ శ్రమకు సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వాతావరణంలోని మార్పు ఆందోళన కలిగిస్తుంది. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఖచ్చితంగా మెలగాలి. బంధువుల రాకతో కొంత  అసౌకర్యానికి గురవుతారు. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
ధనస్సు : రుణ, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. వృత్తి వ్యాపారుల ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాహనచోదకులకు దూకుడు తగదు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది., ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. 
 
మకరం : వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం ఉన్నతిని చూసి బంధువులకు అసూయ కలిగిస్తుంది. గృహోపకరణాలు భారీగా కొనుగోలు చేస్తారు. స్వయంకృషిపైనే ఆధారపడటం ఉత్తమం కుటుంబంలోను, ఇంటా బయట ఊహించని సమస్యలు తలెత్తుతాయి. 
 
కుంభం : అవకాశాలు కలిసిరాక, పనులు సాగక విసుగు చెందుతారు. భవిష్యత్ అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం లభిస్తుంది. మీ అభిరుచులకు తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం వుంది. 
 
మీనం : హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంతానం మొండివైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం.