గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-07-2021 గురువారం దినఫలాలు - బాబా గుడిలో అన్నదానం చేస్తే...

మేషం : వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. 
 
వృషభం : మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. సోదరీ, సోదరులు సన్నిహితుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
మిథునం : ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. డబ్బు దుబారా తగ్గించుకోకపోతే రాబోయే రోజులలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఫర్నిచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : దంపతుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. మీ సంతానం ఉన్న విద్యల గురించి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ప్రమోషన్ బదిలీ ఉత్తర్వులు అందుకుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
సింహం : పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. సోదరీ సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. గృహ మార్పుతో ఇబ్బందులను తొలగి మానసికంగా కుదుటపడతారు. 
 
కన్య : కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. కొత్త పనులే చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు చేస్తారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
తుల : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. మీ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవలసిన సమయం. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 
 
వృశ్చికం : ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. రుణయత్నాలలో కూడా స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటారు. 
 
ధనస్సు : సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్వతంత్ర నిరుద్యోగులు స్థిరపడే కాలం. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన మార్పులుంటాయి. ఆప్తులు, స్నేహితుల సహకారాన్ని కోరడానికి వెనుకాడవద్దు. దంపతుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. 
 
మకరం : ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలిస్తుంది. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. క్లిష్టమైన సమస్యలు తలెత్తినా సమర్థతతో ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ వహించండి. 
 
మీనం : అంతగా పరిచయం లేని వ్యక్తులతో అప్రమత్తంగా మెలగండి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు వ్యాపారులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు బదిలీయత్నం అనుకూలిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. మీ సంతానం విద్యా, వివాహాది విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు.