సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-07-2021 దినఫలాలు - నవదుర్గాదేవిని తెల్లని పూలతో ఆరాధిస్తే

మేషం : బంధు మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. రవాణా ద్వారా ఊహించని లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏ వ్యక్తినీ తక్కువ అంచనా వేయడం మంచిదికాదు. 
 
వృషభం : పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మలను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఫ్లీడర్లకు ఫ్లీడరు గుమస్తాలకు క్లయింట్లతో చికాకులు తప్పవు. మీ యత్నాలు ఫలించడంతో పాటు కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. 
 
మిథునం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. తెలివిగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కొంటారు. శెనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. 
 
కర్కాటకం : బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవిస్తాయి. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మీ ఆశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. గణిత సైన్స్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. 
 
సింహం : విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ప్రత్యర్థుల కదలిక పట్ల ఓ కన్నేసి ఉంచడం శ్రేయస్కరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు సంతృప్తిని ఇస్తాయి. తోటివారి ఉన్నతస్థాయిలో పోల్చుకోవడం క్షేమంకాదు. 
 
కన్య : ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. నిరుద్యోగులలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్తారం ఉంది. జాగ్రత్త వహించండి. రావలసిన ధనం చేతికందడంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. 
 
తుల : గట్టిగా ప్రయత్నిస్తేనే మొండిబాకీలు వసూలు కాగలవు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. రాజకీయాలలోని వారు విరోధులు వేసే పథకాలను తిప్పికొడతారు. 
 
వృశ్చికం : ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం సంతృప్తికరంగా ఉండదు. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : హోటల్, కేటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. ఇంటి పనులలో నిమగ్నం అవుతారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీయొచ్చు. 
 
మకరం : మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. 
 
కుంభం : వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. హోటల్, కేటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులకు కానుకలు సమర్పించి ప్రసన్నం చేసుకుంటారు. 
 
మీనం : ముఖ్యంగా ప్రింట్, మీడియాలలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. చిరు వృత్తుల వారికి సరైన సంతృప్తి లభిస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వడం మంచిదికాదని గమనించండి. మొండిబాకీలు వసూళ్లు వంటి శుభ సంకేతాలున్నాయి.