సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 15 జులై 2021 (00:43 IST)

15-07-2021 - గురువారం మీ రాశి ఫలితాలు... కుబేరుడిని ఆరాధిస్తే..? (video)

కుబేరుడిని ఆరాధిస్తే ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. 
 
మేషం: మీ ఆశయసాధనకు నిరంతర కృషి, పట్టుదల ముఖ్యం. దంపతుల సానుకూల ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవడం క్షేమం. రుణాలు తీర్చేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. నమ్మిన వ్యక్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. 
 
వృషభం: చిన్న తరహా, చిరు పరిశ్రమల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి ప్రోత్సాహం కానవస్తుంది. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
మిథునం: ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తి కాగలవు. ప్రేమికులకు పెద్దల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబం కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రైవేట్ విద్యా సంస్థల వారికి పోటీ పెరుగుతుంది. 
 
కర్కాటకం: ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. పాతమిత్రుల కలయిక గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రాజకీయాల వారికి పార్టీపరంగానూ, అన్ని విధాలా గుర్తింపు లభిస్తుంది. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక అవసరానికి వుంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించాల్సి వస్తుంది. 
 
సింహం: ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. ఎదుటివారితో వీలైనంత క్లుప్తంగా సంభాషించడం శ్రేయస్కరం. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు ఎదుర్కొంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
కన్య: బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం.
 
తుల: కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలక కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు అధికం. వైద్యులకు శస్త్రచికిత్సల్లో ఏకాగ్రత మెళకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆరోగ్యంలో ఆకస్మిక ఆందోళన తప్పదు.
 
వృశ్చికం: శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. దైవ దర్శనానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన ధనం చేతికి అందడంతో మానసికంగా కుదుటపడతారు. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ధ వహించండి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. మీపై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. బంధుమిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదవకాశాలు లభిస్తాయి.
 
మకరం: వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. భక్తి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాశాలల్లో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూలం. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. 
 
కుంభం: భాగస్వామ్యంగా గానీ మీరు ఆశించిన విధంగా రాణించలేరు. స్త్రీల పేరిట పొదుపు పథకాలు లాభిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరం.
 
మీనం: పెద్దల సహకారం లోపస్తుంది. మీ అశ్రద్ధ వల్ల సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం వుంది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది.