సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-07-2021 మంగళవారం దినఫలాలు - ఆంజనేయుడుని పూజించినా...

మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. 
 
మిథునం : రాజకీయాలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశాల సందర్శనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులు సత్ఫలితాలు పొందుతారు. 
 
కర్కాటకం : రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. పోస్టల్ టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉపాధ్యాయుల తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
సింహం : ఆడిటర్లకు అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
కన్య : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బ్యాంకు పనులు వాయిదాపడతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. 
 
తుల : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. విదేశీయానం, రుణ యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఏ విషయంలోనూ మనస్థిమితం అంతంగా ఉండదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటాయి. 
 
ధనస్సు : మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆటో మొబైల్, ట్రాన్స్‌పోర్టు రంగాలలో వారికి జయం చేకూరును. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించ వలసి ఉంటుంది. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోను అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. 
 
మకరం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. మీ విషయంలో ఒక చిన్నపొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికం. 
 
కుంభం : ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. పొదుపు చేయాలనే ప్రయత్నం ఫలించదు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
మీనం : శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. గొప్ప గొప్ప అవకాశాలు మీ దరిచేరతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.