సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-07-2021 గురువారం దినఫలాలు - దత్తాత్రేయస్వామిని ఆరాధిస్తే సంకల్పసిద్ధి

మేషం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చీటికి మాటికి తగవులు తప్పవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలు, శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. 
 
వృషభం : రాబోయే ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. కోర్టు తీర్పులు ఆందోళన కలిగిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి విత్తన కొనుగోళ్ళపై అవగాహన ముఖ్యం. 
 
మిథునం : కాంట్రాక్టర్లకు బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నిలకడగా ఉంటాయి. ఉపాధ్యాయులకు నూతన ప్రదేశం, వాతావరణం అసంతృప్తినిస్తాయి. కుటుంబీకుల మధ్య అభిప్రాయభేదాలు, స్పర్థలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, పోటీతత్వం ఆందోళన కలిగిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. హోటల్, తినుబండారు వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. పండ్లు, పూల, కొబ్బరి వ్యాపారులకు పురోభివృద్ధి. పత్రికా సంస్థలలోని వారికి ర్పు, ఏకాగ్రత ముఖ్యం. 
 
సింహం : అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. మీ అజాగ్రత్త వల్ల గృహంలో విలువైన వస్తువును చేజార్చుకుంటారు. ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. వాహనయోగం వంటి శుభపలితాలు పొందుతారు. 
 
కన్య : పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి. 
 
తుల : ఆస్థి పంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. ఏప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఓర్పు, నేర్పుతో మీరు అనుకున్నది సాధిస్తారు. 
 
వృశ్చికం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ల ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంతానం విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపరుస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. మందులు, కిరాణా, ఫ్యాన్సీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
ధనస్సు : అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలుగుతుంది. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. 
 
మకరం : ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ప్రయాణాలు అనుకూలం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ మంచి తనమే మీకు శ్రీరామరక్ష. ఉద్యోగస్తులు క్లిష్ట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయానికీ ఇతరులపై ఆధారపడే మీ ధోరణి మార్చుకోవడం శ్రేయస్కరం. 
 
కుంభం : రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, జాయింట్ వెంచర్ల అనుకూలతకు మరింకొంతకాలం వేచియుండటం మంచిది. స్త్రీలు, టీవీ, చానెల్స్ కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. 
 
మీనం : విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్, కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు మార్కెట్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ డబ్బులకు కొదవ ఉండదు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు.