శనివారం, 14 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-07-2021 - బుధవారం మీ రాశి ఫలితాలు.. సత్యదేవునిని పూజిస్తే..?

సత్యదేవుని పూజించి అర్చించినా అన్నివిధాలా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: పొదుపు పథకాలు, చిట్‌ఫండ్ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. విద్యాసంస్థలు, హాస్టళ్లు సందర్శిస్తారు. పెట్టుబడులు పొదుపు పథకాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. పూర్వమిత్రులను కలుసుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
వృషభం: ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. నిరుద్యోగులు ఊహాగానాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి.
 
మిథునం: మీ శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల మీ ఆలోచనలుంటాయి. రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. 
 
కర్కాటకం: ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించాల్సి వస్తుంది. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. ఏ విషయంలోను తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. 
 
సింహం: స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా పూర్తి కాగలవు.
 
కన్య: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా వుండటం మంచిది. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశ పరుస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
 
తుల: ఎల్ఐసి పోస్టల్ ఏజెంట్లకు, ఒత్తిడి పెరుగుతుంది. విదేశీయానం అనుకూలం. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. మీ నైపుణ్యతకు, సామర్థ్యానికి తగినట్లు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిది. 
 
వృశ్చికం: స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఇతరులకు హామీలు ఇవ్వడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా సద్వినియోదం చేసుకోండి. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం.
 
ధనస్సు: ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది. 
 
మకరం: హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. మిత్రులను కలుసుకుంటారు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొకతప్పదు.
 
కుంభం: ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశయం నెరవేరకపోవచ్చు. గత అనుభవంతో ఒక సమస్య నుంచి విముక్తులవుతారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. చేసే పనేదైనా అందులోని మంచీ చెడులను తెలుసుకుని, ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయండి. బంధుమిత్రుల రాకతో నూతన ఉత్సాహం కానవస్తుంది. 
 
మీనం: భాగస్వామిక వ్యాపారాలు, సంస్థల నుంచి విడిపోయే విషయంలో పునరాలోచన మంచిది. బంధువుల ఆకస్మిక రాక అనుమానం రేకెత్తిస్తుంది. పై అధికారులు మీ తీరును తప్పుబడుతారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం మంచిది.