సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-07-2021 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభ స్వామిని ఆరాధించినా...

మేషం : వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం  మంచిది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దైవ, పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కొన్ని సంఘటనలు మిమ్మలను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. ఉన్నత విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సంత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మిథునం : స్త్రీల ఆరోగ్యం కుదుటపడటంతో పాటు శారీరకపటుత్వం నెలకొంటుమంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. భాగస్వామికులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ పథకాలు ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. 
 
కర్కాటకం : కంప్యూటర్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
సింహం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు సంతృప్తినిస్తాయి. కొబ్బరి, కూర, పండులు, చల్లని పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ అశ్రద్ధ ఆలస్యాలను వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. 
 
కన్య : ఆర్థిక ఇబ్బందులకు అంటూ ఏదీ ఉండదు. వస్త్ర వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభం చేకూరగలదు. మీ కుటుంబీకుల కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తారు. మీ అభిరుచలకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
తుల : రాజకీయంలోని వారికి కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. మీ చుట్టుపక్కల వారితో సంభాషించేటపుడు మెళకువ వహించండి. మత్స్యు, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు మెళకువ వహించండి. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యుల సహకారం వల్ల సమసిపోతాయి. గణిత సైన్స్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిదని గమనించండి. నూతన వ్యక్తుల పరిచయంలో మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. 
 
ధనస్సు : ఇతర దేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. ప్రింటింగ్ రంగాలలో వారు పై అధికారులతో మాటపడక తప్పదు. పెద్దల ఆరోగ్యంలో వైద్యుని సలహా తప్పదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఆర్థిక విషయాల్లో సంతృప్తికానరాదు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మందులు, ఆల్కహాల్, నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
కుంభం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. 
 
మీనం : ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తులలో వారికి ప్రోత్సాహకరం. వహుందాగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ వహించండి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కార్మికులకు, పారిశ్రామికులకు పరస్పర అవగాహన కుదురుతుంది.