1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Olive Keelback snake found in Markapuram Forest Area Office

మార్కాపురం ప్రభుత్వాఫీసులో ప్రత్యక్షమైన అరుదైన పాము

Olive Keelback Snake
ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆఫీసులో నదీ పరివాహక ప్రాంతంలో కనిపిచే ఓ పాము ఒకటి ప్రత్యక్షమైంది. ఈ పాము పేరు ఆలీవ్ కీల్‌బాక్ స్నేక్. అది అరుదైన పాముగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రభుత్వ అటవీ శాఖ కార్యాలయంలో ప్రత్యక్షమైంది. దీంతో ఈ పామును పట్టుకున్న అటవీ సిబ్బంది... దాన్ని తీసుకెళ్లి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
 
మార్కాపురం ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. దీంతో ఈ ప్రాంతంలోకి అపుడపుడు అరుదైన విష సర్పాలు వస్తుంటాయి. తాజాగా ఈ ఆలీవ్ కీల్‌బాక్ స్నేక్ కూడా అటవీశాఖ కార్యాయంలో ప్రత్యక్షమైంది. 
 
దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారి అప్పావ్ విఘ్నేశ్ మాట్లాడుతూ, ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని, అందువల్ల ఆ పామును పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్టు చెప్పారు. సాధారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇలాంటి పాములు కనిపిస్తుంటాయనీ, కానీ ఇపుడు మైదాన ప్రాంతంలోకి రావడం ఆశ్చర్యపరిచిందని చెప్పారు. 
తర్వాతి కథనం
భార్య అనుమతి లేకుండా చేయడం కూడా గోప్యత ఉల్లంఘనే : హర్యానా హైకోర్టు