గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (07:31 IST)

తెలంగాణాలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిలు జరిగాయి. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 
 
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను అధిక సంఖ్యలో బందోబస్తుగా నియమించారు. 
 
మరోవైపు, కరీంనగర్‌లోని 2 స్థానాకు 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక్కడే అధికార తెరాస అభ్యర్థులకు గట్టిపోటీ ఎదురవుతుంది. దీంతో ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.