శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (09:23 IST)

"పుష్ప" మూవీ మేకర్స్‌పై కేసు నమోదు

"పుష్ప" మూవీ మేకర్స్‌పై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రీరిలీజ్ ‌ఈవెంట్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కె.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరెకెక్కిన "పుష్ప" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 12వ తేదీన యూసుఫ్ గూడలోని పోలీస్ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఐదు వేల మందితో నిర్వహిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అనుమతి తీసుకుంది. 
 
కానీ, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, హైదరాబాద్ నగర వాసులు తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అంయింది. అభిమానులను నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారింది. అలాగే, అనివార్య కారణాలతో ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ కూడా హాజరుకావడం లేదనే వార్త ప్రచారంలోకి వచ్చింది. 
 
దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఫ్యాన్స్... ఎన్ కన్వెన్షన్ గేట్‌ను కూడా విరగ్గొట్టారు. అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను చెదరగొట్టారు. అంతేకాకుండా, అల్లు అర్జున్ అభిమానులు చేసిన పనికి శ్రేయాస్ మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ యూనిట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.