1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. one side lover attacked with knife on young man

గుంటూరులో వన్ సైడ్ లవర్: యువతికి కాబోయే భర్తపై కత్తితో దాడి

one side lover
గుంటూరు నడిబొడ్డున అరండల్ పేట 4వ లైన్‌లో కత్తితో యువకుడిపై దాడి చేసాడో దుండగుడు. గతంలో ఇతడు ఆ యువకుడు పెళ్లాడబోతున్న యువతి వెంటపడి వేధింపులు చేస్తూ, నిన్నే 
ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను తప్ప ఎవరితో ఉండకూడదు అంటుండేవాడు.
 
ఐతే సదరు యువతికి ఇటీవలే మరొక యువకునితో పెళ్లి చేయాలని నిశ్చయించారు పెద్దలు. ఆ యువతి తన కాబోయే భర్తతో కల్సి బయటకి వచ్చిన సమయంలో అదే అదునుగా చూసుకొని అరండల్ 4వ లైన్ పార్క్ దగ్గర యువకుడి పైన కత్తితో దాడికి పాల్పడ్డాడు.
 
చుట్టప్రక్కల వారు గుమిగూడటంతో అక్కడ నుంచి పరారయ్యాడు. వారిరువురిది శారదా కాలనీగా గుర్తించారు. అరండల్ పేటలో కేసు నమోదు చేసింది యువతి.
తర్వాతి కథనం
తిరుమలలో సుందరకాండ పారాయణం, కరోనా నుంచి ఉపశమనం కలగాలంటూ...?