గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:08 IST)

ప్రియుడి మోజులో పడి మహిళ ఏం చేసిందో చూడండి

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో ఉంటున్న ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వీవర్స్‌ కాలనీకి చెందిన నాగభూషణం (అలియాస్‌ చిట్టి) డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అతడికి నల్లమాడ మండలం మీసాలవాండ్లపల్లికి చెందిన ఈశ్వరమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈశ్వరమ్మకు.. నాగభూష ణం వరుసకు మేనమామ అవుతాడు.

ప్రియుడి మోజులో పడి ఈశ్వరమ్మ.. భర్తను హతమార్చినట్లు తెలిసింది. జనవరి 1న భర్తను చంపి, 2న పిల్లవంక కాలనీ సమీపంలో ప్రియుడు, మరో ముగ్గురు సాయంతో శవాన్ని పూడ్చిపెట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత తన భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని చుట్టుపక్కల వారితో చెప్పి, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

రెండు రోజుల క్రితం ముదిగుబ్బలో గుర్తుతెలియని శవం వెలుగు చూడటంతో గుర్తించాలని ఈమెను పిలిపించారు. పోలీసులకు అనుమానం వచ్చి లోతు గా విచారించగా, భర్త నాగభూషణంను తానే హతమార్చినట్లు, శవా న్ని పూడ్చడానికి ప్రియుడి సహాయం తీసుకున్నట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

పోలీసులు మంగళవారం శవాన్ని పూడ్చిన చోటుకు తీసుకె ళ్లారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం ని మిత్తం తరలించారు.