శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:46 IST)

యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. తన మైనర్ కుమార్తె పొలం వెళ్లగా అక్కడ ముగ్గురు యువకులు వచ్చి సామూహిక అత్యాచారం చేసి పారిపోయారని బాధిత బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తాము కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని అలీఘడ్ జిల్లా ఎస్పీ శుభం పటేల్ బుధవారం చెప్పారు.

వారంరోజుల క్రితం గౌతంబుద్ధనగర్ జిల్లాలోని ధంకార్ ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై కొందరు అత్యాచారం జరిపారు. ఈ ఘటనలో బాలిక అత్తపై కూడా కేసు నమోదు చేశారు. హత్రాస్ ఘటన అనంతరం యూపీలో అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది.