బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (22:55 IST)

బాలికపై అత్యాచారం, ప్రశ్నించిన తల్లి, నాన్నమ్మలపై కామాంధుడు దాడి

గుంటూరు: అచ్చంపేట మండలం రోకలిబండ వారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఈ నెల నాలుగవ తేదీన అశోక్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార ఘటనపై ప్రశ్నించిన బాలిక తల్లి, నాయనమ్మలపై నిందితుడు దాడికి పాల్పడగా.. వారిద్దరూ గాయాలపాలయ్యారు. 
 
అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యాచారంపై ఫిర్యాదు చేస్తే.. అచ్చంపేట పోలీసులు మాత్రం దాడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. అశోక్‌పై అత్యాచార కేసు నమోదు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.