గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:26 IST)

కడపలో తల్లీకుమార్తె ఆత్మహత్య, భర్త అమెరికాలో టెక్కీ...

కడప నగరంలోని శంకరాపురం రామాలయం వీధిలో ఉరివేసుకుని తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకున్న దర్ఘటన చోటుచేసుకుంది. 
 
తల్లి పేరు శ్రావణి (34), కూతురు పేరు శాన్వి (9). శ్రావణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. శ్రావణికి 10 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఐతే కొన్ని కారణాల వల్ల నాలుగేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ బిడ్డతో కలిసి ఉంటోంది శ్రావణి.
 
ఆమె మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిన్నచౌకు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.