గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:11 IST)

కోడలిపై 17 మందితో రేప్ చేయించిన మేనత్త

తల్లి లేని అమ్మాయని కోడలును చేరదీసి 17 మందితో అత్యాచారం చేయించిదో అత్త. ఉన్నత విద్యావంతురాలిని చేస్తానని తీసుకెళ్లి కూలి పనులు చేయిస్తూ.. ఆమె శ్రమని, మానాన్ని దోచుకోని జీవితాన్ని బుగ్గిపాలు చేసింది.

కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
చిక్‌మగళూరు సమీపంలోని గ్రామానికి చెందిన విద్య సోదరుడి భార్య చనిపోయింది. అతడికి 15 ఏళ్ల బాలిక ఉన్నది. తల్లిలేని అమ్మాయిని నేనే అమ్మలా సాదుకుంటానని తన ఇంటికి తీసుకెళ్లింది.

ఉన్నతంగా చదివిస్తానని సోదరుడితో నమ్మబలికింది. తీసుకెళ్లిన కొద్ది రోజులు బాగానే చూసుకున్న విద్య.. బాలికను స్థానికంగా ఓ స్టోన్ క్రషర్ కంపెనీలో పనికి పెట్టింది. అక్కడే పని చేస్తున్న ఓ బస్ డ్రైవర్ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ ఘటనను తన ఫోన్‌లో వీడియో తీసుకుని పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అది చాలదన్నట్లు ఆ వీడియోని బయట పెడతానని బాలికను బెదిరిస్తూ మరో 16 మందితో అత్యాచారం చేయించాడు. బాలికకు గర్భం రాకుండా ట్యాబ్లెట్స్ సైతం వేశాడు.

అయితే ఈ దారుణ ఘటన చైల్డ్ వెల్‌పేర్ కమిటీ చైర్‌పర్సన్ సుబ్రమణ్యకు తెలియడంతో ఆమె జనవరి 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను పనిలో పెట్టడం.. అక్కడ 17 మంది అత్యాచారం చేయడం అంతా ఆమె అత్త విద్య ప్లాన్ ప్రకారమే జరిగిందని తేలింది.

డబ్బులకు కక్కుర్తి పడ్డ ఆమె.. కోడలిని ఆమెకు తెలియకుండనే వ్యభిచార కూపంలోకి నెట్టిందని పోలీసుల విచారణ బయటపడింది. అత్యాచారం చేసిన ప్రతి వ్యక్తి దగ్గర ఆమె డబ్బులు తీసుకోనే వారిని బాలిక దగ్గరకు పంపేదని తేలింది. ఇలా ఐదు నెలల పాటు బాలికకు కామాంధులు నరకం చూపించారని చిక్‌మగళూరు జిల్లా ఎస్పీ హకే అక్షయ్ మచింద్ర తెలిపారు.

బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ ఆమెపై 17 మంది అత్యాచారం చేసినట్లు వెల్లడైందని వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన బాలిక అత్త విద్యతోపాటు 8 మందిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.