శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:01 IST)

హెల్మెట్ పెట్టుకో చాక్లెట్ తీసుకో .. రవాణాశాఖ వినూత్న ప్రదర్శన

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువశాతం హెల్మెట్ దరించకపోవడం వలన ప్రాణ నష్టానికి గురవుతున్నారని, ప్రాణం పోతే తిరిగి రాదని ప్రాణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనపైనే ఉన్నదని మోటార్ వాహన తనిఖీ అధికారి ఆయుష ఉష్మని అన్నారు.
 
కృష్ణా జిల్లా కంచికచర్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రవాణాశాఖ అధికారులు హెల్మెట్ , సీట్ బెల్ట్ పై వినూత్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అయేష ఉష్మని మాట్లాడుతూ.. ప్రాణం కన్నా విలువైనది ఏమీ లేదని ప్రాణం ఉన్నంత వరకే మన కుటుంబం మనము అనే ప్రేమానుబంధాలు కలిగిఉంటాయని ఆమె అన్నారు.

వాటిని నిలుపుకోవాలని బాధ్యత కూడా మన పైనే ఉన్నదని ఆమె గుర్తు చేశారు.. హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనాలు నడుపుతున్న వాహనచోదకులకు తీపి గుర్తుగా చాక్లెట్లను ఇచ్చి అదే జాగ్రత్తతో భవిష్యత్తులో కూడా వాహనాలు నడపాలని ఆమె కోరుతూ అభినందించారు. 

రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం అనేది మనకి చెప్పి రాదని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు నడపాలని అప్పుడే ప్రమాదాల నుండి దూరంగా ఉండగలుగుతాం అన్నారు.

ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలని ఏదైనా అనుకోని రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయం కాకుండా కాపాడుతుందని, సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పక దరించే వాహనం నడపాలని ఆయన అన్నారు.