ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:04 IST)

ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి: మంతెన సత్యనారాయణరాజు

ఏపీలో జరుగుతున్న పరిణామాలు ప్రతిఒక్కరికీ రోతపుట్టిస్తున్నాయని, పంచాయతీఎన్నికల్లో గెలుపుకోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నానాటికీ దారుణంగా ఉన్నాయని, వాటిని నిరోధించాల్సిన పోలీసులు చోద్యంచూస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు వాపోయారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జరుగుతున్న దారుణాలపై స్పందించాల్సిన ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి ఎవరికివారే తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీనేత ఆగ్రహం వ్యక్తంచేశారు.

మొన్నటికి మొన్న శ్రీకాకుళంలో జరిగినఘటనకానీ, యలమంచిలిలోఎమ్మెల్యే బెదిరింపులుగానీ, నేడు గుంటూరు, చిత్తూరులో జరిగినఘటనలుకానీ ప్రజాస్వామ్యా నికి ఎంతమాత్రం సమ్మతమైనవి కావన్నారు.  (ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలను, ఆడియోసంభాషణలను  ఈ  సందర్భంగా సత్యనారాయణరాజు విలేకరులకు వినిపించారు)

ప్రజాస్వామ్యంలో అందరి ఆమోదంతో, సామరస్యంగా, న్యాయంగా ఏకగ్రీవాలు చేసుకోవడం తప్పుకాదుగానీ,  బెదిరింపులు, దాడులు, దౌర్జన్యా లతో చేయడమేంటన్నారు? అచ్చెన్నాయుడు గారు తన బంధువుతో మాట్లాడిన మాటల్లో  ఏం తప్పుందని ఈప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసిందన్నారు.

వీధిరౌడీలా మాట్లాడుతూ, రోడ్దుపై వీరంగాలువేసినవారిని వదిలేసి, అచ్చెన్నాయుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబో,  శ్రీనివాస్ పై ఎలాంటి కేసులుపెట్టారో పోలీసులు సమాధానంచెప్పాలన్నారు. విలువలతో కూడిన రాజకీయంచేసే అచ్చెన్నాయుడి కుటుంబంపై  ఈవిధంగా వ్యవహరించడం ఎంతమాత్రం తగదన్నారు.

వార్డు మెంబర్ గా నామినేషన్ వేసిన వ్యక్తి అల్లుడైన సంతోష్ కు ఫోన్ చేసిన యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఏ విధంగా దుర్భాషలా డారో అందరూ విన్నారన్నారు. 307 సెక్షన్ గానీ, ఎస్సీ, ఎస్టీ కేసులు గానీ ప్రభుత్వం, పోలీసులు ఎలా దుర్వినియోగంచేస్తున్నారో, వారికి వారే ఆలోచించుకోవాలన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎస్ఈసీ దృష్టిసారించాలని, గవర్నర్ గారుకూడా ఎన్నికల ప్రక్రియపై నిఘా పెట్టాలని టీడీపీఎమ్మెల్సీ కోరారు.  ఏకగ్రీ వాల ముసుగులో రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై గవర్నర్ తక్షణమే జోక్యంచేసుకొని ఎస్ఈసీకి, డీజీపీకి తగిన విధంగా ఆదేశా లు జారీచేయాలన్నారు. 

దువ్వాడ శ్రీనివాస్ పై, కన్నబాబు రాజు లపై తగినవిధంగా  చర్యలు తీసుకోవాలన్నారు.  చిత్తూరులో జరుగుతున్న ఏకగ్రీవాలపై కూడా గవర్నర్ దృష్టిపెట్టాలన్నారు. గుంటూరులో అత్యుత్సాహం చూపిన ఎస్ఐపై తక్షణమే ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు.