గవర్నర్‌తో భేటీ అయిన నిమ్మగడ్డ రమేష్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను వివరింన్నారు.
అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణ చర్యల గురించి కూడా ఆయన గవర్నర్‌కు తెలపనున్నారు. మరి కాసేపట్లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ రానున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఇరువురు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొవిడ్ వైరస్ వ్యాక్సినేషన్ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయం నుంచి జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్య, ఆర్థిక, ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్ శాఖల కమిషనర్లు కూడా పాల్గొంటారు.
పైన పేర్కొన్న శాఖలు, విభాగాల జిల్లా స్థాయి అధికారులందరూ వీడియో కాన్ఫరెన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.