సంబంధిత వార్తలు
- నిర్ణీత కాల వ్యవధిలోనే లబ్ధిదారులకు అందాలి : జాయింట్ కలెక్టర్
- స్పీకర్ తమ్మినేని వాదనతో ఏకీభవిస్తున్నా: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సంచలన ప్రకటన
- మోదీ ప్రకటనలోని ఆంతర్యం అదేనా?..అందుకేనా ఆ సమయంలో దీపం?
- దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ కృషి ప్రశంసనీయం : జూపూడి
- బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్‌గా సీఎం జగన్ గుర్తించారు : శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
భారత క్రికెట్ జట్టుకు గవర్నర్ అభినందన
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు సభ్యులను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. 2-1 స్కోరుతో సిరీస్ గెలిచి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోవటం శుభపరిణామమన్నారు.
భారత క్రికెట్ జట్టు విజయానికి దేశం మొత్తం గర్విస్తుందని, ప్రజలంతా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని గవర్నర్ హరిచందన్ అన్నారు. భారత క్రికెట్ జట్టు రూపంలో మువ్వన్నెల జెండా ప్రపంచ వినువీధులలో నిరంతరం ఎగురుతూనే ఉంటుందన్న ఆశాభావాన్ని గవర్నర్ హరిచందన్ వ్యక్తం చేశారు. భారత క్రికెట్టు జట్టు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
