1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Operation Bunty: Forest staff, cops catch bear in Srikakulam district

శ్రీకాకుళంలో ఎలుగుబంటిని పట్టేశారు...

bears
గత కొన్ని రోజులుగా భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చిన ఎలుగుబంటిని శ్రీకాకుళం అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఎలుగుబంటు గత కొన్ని రోజులుగా సంచరిస్తూ హల్చల్ చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దీన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. ఇన్ని రోజులు చిక్కకుండా తప్పించుకుని తిరగసాగింది. 
 
ఈ క్రమంలో గన్ సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు. ఈ ఎలుగుబంటిని జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కడిసింగిలోని పశువుల పాకలో ఉండగా స్థానికులతో కలిసి అధికారులు బోనులో బంధించారు. 
 
కాగా, ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడిపై ఎలుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచాడు. అలాగే, వజ్రపుకొత్తూరు సంతోషిమాత ఆలయంలోని జీడితోటలో పశువుల కోసం రేకుల షెడ్డు వేస్తుండగా ఎలుగుబంటి ఏడుగురిపై దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు మృతిచెందగా.. ఆరుగురు శ్రీకాకుళంలోని మెడికేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
తర్వాతి కథనం
ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు?